ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాలు వీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చలపై పురోగతి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల పెంపును స్వాగతించడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. భారత స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,047 పాయింట్లు పెరిగి 57,684 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అలాగే నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 17,287 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రంగనాథన్ మాట్లాడుతూ.. ఫెడ్‌రేట్ల పెంపు తర్వాత చమురు ధరలు తగ్గించడం, రష్యా ఉక్రెయిన్ చర్చలు మధ్యాహ్నం ట్రేడ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు రెండుశాతానికి పెరిగాయన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్డీఎఫ్సీ 5.4శాతం లాభపడింది.
జెఎస్డబ్ల్యు స్టీల్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్, ఆర్ఐఎల్, కోటక్ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఐషర్ మోటార్స్ 3 నుంచి 5 శాతం మధ్య ఎగబాకాయి. ఇన్ఫోసిస్, సిప్లా, ఇండియన్ ఆయిల్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగాయి. టైటాన్ కంపెనీ ఇంట్రాడే సెషన్లో బీఎస్ఈలో ఐదుశాతం పెరిగి.. రూ.2718.65 రికార్డు స్థాయికి చేరింది. పేటీఎం షేర్లు ఆరు శాతానికి పడిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం పెరిగాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 3 శాతానికి పైగా లాభపడి, వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ సూచీలు 2 నుంచి 2.5 శాతం మధ్య ట్రేడయ్యాయి. యూఎస్ ఫెడ్ ప్రకటన గ్యాస్, చమురు షేర్లు పెరిగాయి. ఆసియా మార్కెట్లో జపాన్ నిక్కీ 3.5శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.3శాతం, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ 7శాతం ముగిసింది. హోలీ సందర్భంగా శుక్రవారం షేర్ మార్కెట్‌కు సెలవు కాగా.. సోమవారం ట్రేడింగ్ జరుగనున్నది.