Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన విషయం తెలిసిందే. జీఎస్టీ స్లాబులను మార్చానున్నట్లు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కౌన్సిల్ నిర్ణయానికి ముందు మదుపరులు సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,295.99 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,004.60 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 80,671.28 పాయింట్ల వరకు పెరిగింది.
చివరకు 409.83 పాయింట్ల లాభంతో 80,567.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135.45 పాయింట్లు పెరిగి 24,715.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,415 షేర్లు లాభపడగా.. 1,333 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ట్రెంట్, ఐటీసీ, ఎటర్నల్, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, విప్రో, హెచ్యూఎల్, టీసీఎస్, నెస్లే, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో కొనసాగాయి.