Stock Market | భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండోసెషన్లోనూ లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లో సానుకూల పవనాల మధ్య మార్కెట్లు దూసుకెళ్లాయి. ఉగ్రదాడి నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవడంతో తొలి అర్ధభాగంలో మార్కెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అయితే, మధ్యాహ్నం సెషన్లో ఆటో, మెటల్, ఐటీ రంగంలో కొనుగోళ్లతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,671.52 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,124.03 పాయింట్ల కనిష్టానికి చేరుకున్న సెన్సెక్స్.. గరిష్టంగా 83,936.47 పాయింట్లకు పెరిగింది. చివరకు 335.97 పాయింట్ల లాభంతో 83,871.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 120.6 పాయింట్లు పెరిగి 25,694.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలను ఆర్జించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ, టీఎంపీవీ, పవర్ గ్రిడ్ నష్టపోయాయి.
పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 0.3శాతం తగ్గాయి. టెలికాం ఇండెక్స్ 1.5 శాతం పెరగ్గా.. ఐటీ ఇండెక్స్ ఒకశాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.7 శాతం, ఆటో ఇండెక్స్ ఒకశాతం, మెటల్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. క్యూ-2 ఆదాయాల తర్వాత బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర 7 శాతం పడిపోయాయి. క్యూ 2 నష్టాలు తగ్గడంతో వోడాఫోన్ ఐడియా షేర్లు 8 శాతం పెరిగాయి. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 5 శాతం వృద్ధి చెందాయి. రెడెరియట్ స్టెనర్సన్ ఏఎస్‌తో ఎల్‌ఓఐపై సంతకం చేయడంతో స్వాన్ డిఫెన్స్ షేర్ ధర 5 శాతం పెరిగింది. సీఈవో రాజీనామాతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ ధర 3 శాతం పతనమైంది. కూ2 నష్టాలు తగ్గడంతో అథర్ ఎనర్జీ షేర్లు 7శాతం వృద్ధిని నమోదు చేశాయి. క్రాఫ్ట్స్మన్, భారత్ ఫోర్జ్, బీహెచ్ఈఎల్, నాల్కో, అశోక్ లేలాండ్, హిటాచి ఎనర్జీ, ఎం అండ్ ఎం, అసహి ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్, కెన్ ఫిన్ హోమ్స్, ఐఓసీ, శ్రీరామ్ ఫైనాన్స్, టోరెంట్ ఫార్మా, ఎంసిఎక్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ వంటి వందకంటే ఎక్కువ స్టాక్‌లు ఈఎస్ఇలో 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.