Stocks | గతవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 602.75 పాయింట్ల లబ్ధితో 80,005.04 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 158.35 పాయింట్లు పుంజుకుని 24,380.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ-50లో 36 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంకు, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితర స్టాక్స్ 5.35 శాతం వరకూ పుంజుకున్నాయి. మరోవైపు కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, బీఈఎల్ తదితర 14 స్టాక్స్ 3.76 శాతం వరకూ నష్టపోయాయి. ఎన్ఎస్ఈ స్మాల్ క్యాప్ -100 1.20 శాతం, మిడ్ క్యాప్ -100 0.83 శాతం లబ్ధితో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ తోపాటు అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ 3.78 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.93, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.27 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్సులు ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.