శంషాబాద్ రూరల్, జూలై 4: కౌలాలంపూర్ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శుక్రవారం రాత్రి 11:30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎం ఎక్స్-199 నంబర్‌గల విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కారం కాలేదు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లాల్సిన మలేషియా ఎయిర్‌లైన్స్‌ను అధికారులు రద్దు చేశారు. 150 మంది ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.