Pocso Case | గుర్రంపోడ్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు.. గతంలోనూ రెండు పోక్సో కేసులు!
Pocso Case | బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది.ఈ మేరకు గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను నల్గొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
Pocso Case | బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది.ఈ మేరకు గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను నల్గొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలికను నిందితుడు అడ్డగించి, ఆమెతో అసభ్యంగా వ్యవహరించాడు. అనుచితంగా తాకి వేధించాడు. ఇంటికి వెళ్లాక బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి, పలుచోట్ల తిరిగినట్లుగా గుర్తించారు. సదరు మాస్క్ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయగా.. గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ అని తెలిసింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నకిరేకల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా సత్యనారాయణపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

