న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అయితే ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై విపక్షాలు లోక్‌సభలో ఆందోళన చేశాయి. నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ అంశాలపై విపక్ష సభ్యులు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. కానీ విపక్ష సభ్యులు మాత్రం తమ నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా అసహనానికి గురయ్యారు. సభలో మొదటి రోజే ఇలా సాగితే అది చెడు సంప్రదాయాన్ని సూచిస్తుందని అన్నారు. ఆయన సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలోనూ ఇదే తరహా సీన్ రిపీటైంది. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ స్కాండిల్పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, విద్యార్థులు నీట్ పరీక్ష పట్ల ఆందోళనకరంగా ఉన్నారని, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు గురించి తాను మాట్లాడబోతున్నట్లు చెప్పారు. నీట్ పరీక్ష లీకేజీ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారని, కానీ ఆ విద్యార్థులపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు స్వరాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం బలగాలను ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల్ని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌కు తెగించారని ఖర్గే ఆరోపించారు.
#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 Noon today.
Leader of the Opposition in Rajya Sabha Mallikarjun Kharge says, “You have allowed me to present my views regarding this paper leak and the NEET examination scandal. This is a matter concerning students; I am… pic.twitter.com/2bRWp771zI
— ANI (@ANI) July 20, 2026