IPS Trainee | నేనేం తప్పు చేయలేదు.. వాట్సాప్ స్టేటస్ పెట్టి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు.
IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించి అతన్ని ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు ముందు తన తప్పేమీ లేదని ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ పెట్టడం గమనార్హం.
తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతోపాటు వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు చంపేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి పెట్టి ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని ఆ అధికారిణి ఆరోపించారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళా ఐపీఎస్ ట్రైనీ చేసిన ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నిర్ణయంతో జాతీయ పోలీస్ అకాడమీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. దీనికి ముందు తన తప్పేమీ లేదంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

