Mahindra XUV700 AX7 | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ కారు ఎక్స్ యూవీ 700 ఏఎక్స్7 (XUV 700 AX7) మోడల్ కార్లపై ధర తగ్గించింది. ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించి మూడేండ్లవుతున్న సందర్భంగా కొత్త ధరలు ప్రకటిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. మార్కెట్లోకి ఎంటరైన కొద్ది కాలంలోనే మహీంద్రా ఎక్స్ యూవీ 700 ఏఎక్స్7 కారు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ సంపాదించుకున్నది. ఇటీవలే రెండు లక్షల యూనిట్లు విక్రయించిన మైలురాయిని దాటింది.
మహీంద్రా ఎక్స్ యూవీ ఏఎక్స్7 కారు ధర రూ.19.49 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) మొదలవుతుంది. మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ఈ కారు ధర రూ.21.54 లక్షల నుంచి ప్రారంభమైంది. సెలెక్టెడ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.2.2 లక్షల మేరకు ధర తగ్గించినట్లు తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.మహీంద్రా ఎక్స్ యూవీ ఏఎక్స్7 కారు ధర తగ్గింపు కేవలం నాలుగు నెలలే అమల్లో ఉంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఇదే మోడల్ కారులో డీప్ ఫారెస్ట్, బర్ట్న్ సియన్నా పెయింట్ ఆప్షన్లలో తెచ్చింది.
Vivo | వివో నుంచి మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
New EV Policy | కొత్త ఈవీ పాలసీ’లో మార్పులు.. దేశీయ కంపెనీలకే బెనిఫిట్లు.. ఎందుకంటే..?!
Tomato | మండే బ్లూస్ మాదిరిగా టమాటా కష్టాలు.. సెంచరీకి చేరువలో కిలో..!