న్యూఢిల్లీ, డిసెంబర్ 13: జావా, యెజ్డీ, బీఎస్ఈ పేర్లతో లగ్జరీ బైకులను విక్రయిస్తున్న క్లాసిక్ లెజెండ్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టుబడులు పెట్టబోతున్నది. ఇతర ఇన్వెస్టర్లుతో కలిపి మహీంద్రా రూ.875 కోట్ల మేర పెట్టుబడి పెట్టాలనుకుంటున్నది. ఈ తాజా పెట్టుబడుల్లో మహీంద్రా రూ.525 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా, ఇతర ఇన్వెస్టర్లు రూ.350 కోట్ల నిధులు చొప్పించనున్నాయి. ఈ పెట్టుబడుల తర్వాత మహీంద్రా వాటా 60 శాతానికి చేరుకోనున్నది.