Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థలన్నీ రూ.1,93,181.15 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. గత వారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1614.82 పాయింట్లు (2.46 శాతం) నష్టపోయింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,580.57 కోట్లు కోల్పోయి రూ.12,25,983.46 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.40,562.71 కోట్ల పతనంతో రూ.11,14,185.78 కోట్లతో సరి పెట్టుకున్నది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 22,935.65 కోట్ల నష్టంతో రూ.15,32,595.88 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.19,320.04 కోట్ల నష్టంతో రూ. 5,73,022.78 కోట్ల వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,161.01 కోట్ల పతనంతో రూ.5,13,735.07 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.15,759.95 కోట్ల నష్టంతో రూ. 4,54,814.95 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,827.73 కోట్లు కోల్పోయి రూ.6,39,292.94 కోట్లతో సరి పెట్టుకున్నది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,900.49 కోట్లు నష్టపోయి రూ.5,40,637.34 కోట్లకు చేరుకున్నది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,124.96 కోట్లు కోల్పోయి రూ.5,83,098.06 కోట్ల వద్ద నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ. 2,008.04 కోట్ల నష్టంతో రూ.5,00,670.73 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా మొదటి స్థానంలో రిలయన్స్ కొనసాగింది. తర్వాతీ స్థానంలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.