Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థలు రూ.62,586.88 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 180.74 పాయింట్ల నష్టంతో ముగిస్తే, నిఫ్టీ 35.95 పాయింట్ల పతనంతో సరిపెట్టుకుంది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,308.58 కోట్లు కోల్పోయి రూ.12,91,919.56 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.25,296.43 కోట్ల నష్టంతో రూ.5,95,597.10 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,108.05 కోట్ల పతనంతో రూ.15,87,533.37 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.3,865.08 కోట్ల నష్టంతో రూ.5,79,373.96 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2,008.74 కోట్ల పతనంతో రూ.11,57,145.86 కోట్లకు చేరుకున్నది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.20,413.41 కోట్లు పుంజుకుని రూ.4,73,186.41 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.8,520.13 కోట్ల లాభంతో రూ.5,19,279.14 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,526.52 కోట్ల లబ్ధితో రూ.5,54,207.44 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,296.63 కోట్ల లాభ పడి రూ.6,66,728.97 కోట్ల వద్ద నిలిచింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.535.48 కోట్లు పెరిగి రూ.5,34,316.52 కోట్ల వద్ద స్థిర పడింది.
గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.