Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,01,552.69 కోట్లు పెరిగింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ ‘బుల్లిష్’గా ఉండటంతో భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,707.01 పాయింట్లు (2.10 శాతం) లబ్ధి పొందింది. గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 83,116.19 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది.
భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.54,282.62 కోట్లు వృద్ధి చెంది రూ.9,30,490.20 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,662.44 కోట్లు పెరిగి రూ.8,80,867.09 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఎం-క్యాప్ రూ.23,427.12 కోట్లు పుంజుకుని రూ.16,36,189.63 కోట్ల వద్ద ముగిసింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,438.6 కోట్ల వృద్ధితో రూ.6,89,358.33 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.22,093.99 కోట్లు పెరిగి రూ.12,70,035.77 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,480.49 కోట్లు పుంజుకుని రూ.8,07,299.55 కోట్ల వద్ద స్థిర పడింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,194.17 కోట్లు పెరిగి రూ.6,42,531.82 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.9,878.19 కోట్లు పుంజుకుని రూ.19,92,160.61 కోట్ల వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.7,095.07 కోట్ల గ్రోత్ తో రూ.7,05,535.20 కోట్లకు చేరుకున్నది.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,004.38 కోట్లు నష్టంతో రూ.6,54,004.76 కోట్ల వద్ద నిలిచింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్ యూఎల్), ఎల్ఐసీ, ఐటీసీ నిలిచాయి.