హైదరాబాద్, ఫిబ్రవరి 4: హైదరాబాద్లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ తాజాగా నగరంలో జీసీసీని బుధవారం ప్రారంభించింది. దీర్ఘకాలిక, ఆవిష్కర్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగరంలో జీసీసీని నెలకొల్పినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
టెక్నాలజీ కార్యకలాపాలను అంతర్జాతీయ విస్తరణలో భాగంగా ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు, తద్వారా గ్లోబల్ కంపెనీలకు ఇక్కడి నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్పీఎల్ ఫైనాన్షియల్ చీఫ్ టెక్నాలజీ అధికారి గ్రేగ్ గేట్స్ తెలిపారు.