LPG Burden | సామాన్యుడిపై ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.165 మేరకు వంటగ్యాస్ సిలిండర్ భారం పడింది. వరుసగా ఈ నెల 17న వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెంచేశాయి కేంద్ర ముడి చమురు సంస్థలు. దీంతో మొత్తం వంట గ్యాస్ సిలిండర్ భారం ఈ ఏడాది రూ.165 పెరిగింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కేంద్ర చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమలులోకి వచ్చేసింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఒకవేళ అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాల్సి ఉంటుంది. గత నెల ఒకటో తేదీన సబ్సిడీ సిలిండర్ ధర పెంచిన చమురు సంస్థలు.. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధర పెంచాయి. తాజాగా ఈ నెల 17న సబ్సిడీ సిలిండర్ ధర రూ.25 పెంచేశాయి.
ఇక సౌదీ ఆరామ్ కో ఎల్పీజీ గ్యాస్ ధరలో ఎఫ్వోబీ (ఫ్రీ ఆన్ బోర్డ్) ధర, సముద్ర రవాణా, బీమా, కస్టమ్స్ సుంకం, నౌకాశ్రయాల్లో చార్జీలు త్వరలో జత కలువనున్నాయి. కేంద్రం విధిస్తున్న జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా చార్జీలకు ఇవి అదనం కానున్నాయి. ప్రతి నెలా కేంద్ర చమురు సంస్థలు ప్రతి నెలా భారత్‌లో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేస్తాయి. ఇక రాష్ట్రాలు విధించే రాష్ట్ర పన్నుల వల్ల ఎల్పీజీ సిలిండర్ ధర మారే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోగ్రామ్ల ఎల్పీజీ (వంట) గ్యాస్ సిలిండర్ ధర రూ.859.50లకు లభిస్తుంది. కోల్‌కతాలో రూ.886.50, చెన్నైలో రూ.875.50లకు అందుబాటులో ఉంది. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో అత్యధికంగా కోల్‌కతాలోనే వంటగ్యాస్ సిలిండర్ ధర పలుకుతున్నది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వరుసగా ఐదో రోజు బుధవారం ముడి చమురు ధర తగ్గిపోయింది. శుక్రవారానికి బ్యారెల్ ముడి చమురు ధర 63 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నది.
Home loans | జాయింట్ హోంలోన్స్.. దంపతులైతే ఇలా బెనిఫిట్స్!
Facebook India : చిన్న వ్యాపారులకు అండగా ఫేస్బుక్.. లోన్ బిజినెస్‌లోకి అడుగు
సూరత్ వస్త్ర పరిశ్రమపై తాలిబన్ల దెబ్బ.. వందల కోట్లలో బకాయిలు