Home Loan Interest Rates | ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తారు. అయితే, ప్రతి వస్తువు ధర పెరిగిపోయిన నేపథ్యంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వల్లే సాధ్యం. బ్యాంకులు కూడా రుణ గ్రహీత వయస్సు, విద్యార్హతలు, ఆదాయం, డిపెండెంట్లు, జీవిత భాగస్వామి ఆదాయం, వృత్తి పరమైన స్థిరత్వం, అప్పులు, సేవింగ్స్ హిస్టరీ, కొనుగోలు చేసే ఇంటి విలువ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
రుణ గ్రహీత తీసుకునే ఇంటి రుణంపై వడ్డీరేటు ఖరారవుతుంది. అదీ కూడా ఆదాయం ప్లస్ వడ్డీ కలిపి ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పూర్తిగా మంజూరు చేసిన తర్వాత ఈఎంఐ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. రుణ గ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా కూడా వారికి రుణం మంజూరు చేయొచ్చా.. లేదా.. అన్న విషయం ఖరారు చేస్తారు. ఇంటి రుణం తీసుకోవాలని భావించే వారు తక్కువ వడ్డీపై రుణాలిచ్చే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏవీ అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీ పేమెంట్ చార్జీలు, టాపప్ నిబంధనలు, ఇతర చార్జీలు వర్తిస్తాయి.
భారతీయ స్టేట్ బ్యాంక్: 8.50-9.85
బ్యాంక్ ఆఫ్ బరోడా: 8.40-10.90
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి: 8.30-10.90
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.30-10.30
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 8.35-11.10
కెనరా బ్యాంకు : 8.40-11.15
యూకో బ్యాంకు : 8.45- 10.30
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : 8.35-11.15
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ : 8.50-10.00
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : 8.40-10.60
ఇండియన్ బ్యాంక్ : 8.40-10.30
కోటక్ మహీంద్రా బ్యాంక్ : 8.75 శాతం నుంచి
ఐసీఐసీఐ బ్యాంక్ : 8.75 శాతం నుంచి
యాక్సిస్ బ్యాంక్: 9.75-9.65
హెచ్ఎస్బీసీ బ్యాంక్: 8.50 శాతం నుంచి
సౌత్ ఇండియన్ బ్యాంక్ : 8.70-11.70
కరూర్ వైశ్యా బ్యాంక్: 9.00 – 11.05
కర్ణాటక బ్యాంక్ : 8.75-10.87
ఫెడరల్ బ్యాంక్: 8.80 శాతం నుంచి
ధనలక్ష్మి బ్యాంక్: 9.35-10.50
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ : 8.60-9.95
బంధన్ బ్యాంక్: 9.16-13.33
సీఎస్బీ బ్యాంక్ : 10.49-12.34
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – 8.75 శాతం నుంచి
సిటీ యూనియన్ బ్యాంక్ : 8.75-10.50