e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home బిజినెస్ బీమాతో కొండంత ధీమా

బీమాతో కొండంత ధీమా

బీమాతో కొండంత ధీమా

కొవిడ్‌ నేపథ్యంలో పాలసీలకు పెరిగిన ఆదరణ

హైదరాబాద్‌, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సంరక్షణ, జీవిత భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల కోసం ప్రభుత్వం రెండు బీమా పథకాలను అమలు చేస్తున్నది. అందులో ఒకటి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై), మరొకటి ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). కొవిడ్‌ నేపథ్యంలో వీటికి ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. అయితే వాటిని ైక్లెయిమ్‌ చేసుకోవడంపై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయిలో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా చాలా మంది లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొంది. మరి బీమా తీసుకున్న వారు ఎలా ైక్లెయిమ్‌ చేసుకోవాలి? అధికారులు తిరస్కరిస్తే ఏమి చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ఇదీ..

జీవిత బీమా కంటే ప్రమాద బీమాకే మొగ్గు

ప్రభుత్వం అమలు చేస్తున్న పై రెండు పథకాల్లో ఎక్కువ మంది ప్రమాద బీమాకు సంబంధించిన పీఎంఎస్‌బీవై వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. వార్షిక ప్రీమియం రూ.12 వేలు మాత్రమే. ఈ పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష అందిస్తారు. ఈ పాలసీని తీసుకునేందుకు 18- 70 ఏండ్లవారు అర్హులు. ఇక పీఎంజేజేబీవై పాలసీ జీవిత బీమాకు సంబంధించినది. వార్షిక ప్రీమియం రూ.330 మాత్రమే ఉండే ఈ పాలసీ తీసుకునేందుకు 18-50 ఏండ్లవారు అర్హులు. ఈ పాలసీదారు సహజ మరణం పొందినా వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందిస్తారు. అయితే పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై పాలసీలు తీసుకున్నవారిలో చాలా మంది వాటిని క్లెయిమ్‌ చేసుకోకపోతున్నారు. పాలసీ తీసుకున్నవారు ఆ సమాచారాన్ని ఇంట్లో తెలియజేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అదీగాక కొందరు బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్‌ ద్వారా పాలసీలను తీసుకుని వదిలేస్తున్నారు తప్ప సంబంధిత బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి నిర్దేశిత పత్రాలను ఇవ్వడం కానీ, పాలసీ నంబర్‌ తదితర విషయాలను తెలుసుకోవడం గానీ చేయడం లేదు. బ్యాంకు అధికారులు సైతం పాలసీ ప్రీమియంను కట్‌ చేసుకుంటున్నారు తప్ప తదుపరి పూర్తిచేయాల్సిన తతంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. దీంతో బీమా సాయం అందక పాలసీదారులు నష్టపోతున్నారు.

ఎలా ైక్లెయిమ్‌ చేసుకోవాలి..

  • పాలసీ తీసుకున్న వ్యక్తికి నామినీగా ఉన్నవారే బీమా సొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది.
  • పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే వెంటనే సదరు నామినీ ఆ పాలసీదారు బ్యాంకు ఖాతా పుస్తకంతో నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలి.
  • పాలసీకి సంబంధించిన క్లెయిమ్‌ ఫామ్‌ను తీసుకుని, దానిలో వివరాలను నింపి బ్యాంకు అధికారులకు ఇవ్వాలి.
  • పాలసీదారుడి ఆధార్‌ కార్డు, డెత్‌ సర్టిఫికెట్‌తో పాటు నామినీ తనకు చెందిన వ్యక్తిగత వివరాలు, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాలను అందజేయాలి.
  • ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి నామినీ పేరును సూచించకపోతే సదరు వ్యక్తి కుటుంబీకులు స్థానిక అధికారుల ద్వారా మంజూరైన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
  • నామినీ దరఖాస్తుపై అధికారులు 30 రోజుల్లోగా విచారణ జరిపి బీమా సొమ్మును అందజేయాల్సి ఉంటుంది.

తిరస్కరణకు గురయితే ఎవరిని ఆశ్రయించాలి..

  • ఈ రెండు పథకాలకు రాష్ట్రంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ బ్యాంకుగా వ్యవహరిస్తున్నది. కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెడితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 8933లో ఫిర్యాదు చేయవచ్చు.
  • నిర్దేశిత గడువులోగా బ్యాంకు అధికారులు స్పందించకుంటే వెంటనే నేరుగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలి.
  • అంబుడ్స్‌మన్‌ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేరుగా బీమా లోక్‌పాల్‌ అధికారులను ఆశ్రయించవచ్చు. ఈ బీమా లోక్‌పాల్‌ కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది. ఈ అధికారులను 040-67504123/23325325 నంబర్లలో కానీ, ఈసీఓఐ.ఇన్‌ వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.
  • అక్కడా న్యాయం జరగకపోతే నేరుగా బీమా కంపెనీల నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐకి చెందిన ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ మెసేజ్‌ సెల్‌ (ఐజీఎంఎస్‌)ను ఆశ్రయించవచ్చు. అక్కడ పరి ష్కారం లభించనున్నది.

పీఎంజేజేబీవై (ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన)

సంవత్సరం నమోదు ైక్లెయిమ్‌ క్లియర్‌
చేసుకున్నవారు దరఖాస్తులు అయినవి
2018-19 5.92 కోట్లు 1,45,763 1,35,212
2019-20 6.96 కోట్లు 1,90,175 1,78,189
2020-21 10.27 కోట్లు 2,50,351 2,34,905
నోట్‌: 2020-21కు సంబంధించిన వివరాలు
2021 మార్చి 31 నాటి వరకే)

పీఎంఎస్‌బీవై (ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన)

సంవత్సరం నమోదు ైక్లెయిమ్‌ క్లియర్‌
చేసుకున్నవారు దరఖాస్తులు అయినవి
2018-19 15.47కోట్ల మంది 40,749 32,176
2019-20 18.54కోట్ల మంది 50,328 39,969
2020-21 23.26కోట్ల మంది 58,540 45,472

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీమాతో కొండంత ధీమా

ట్రెండింగ్‌

Advertisement