HDFC Bank -LIC | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు (HDFC Bank) లో వాటాలను పెంచుకునేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు (HDFC Bank) లో ఎల్ఐసీ (LIC)కి 5.19 శాతం వాటా ఉంది. మరో 4.8 శాతం వాటా పెంచుకోవడానికి ఆర్బీఐ (RBI) అనుమతి ఇచ్చింది.
అంటే వచ్చే ఏడాది (2025, జనవరి 25) నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎల్ఐసీ (LIC) తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని తెలిపింది. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో ఈ పరిమితికి మించి ఎల్ఐసీ తన వాటాను 9.99 శాతానికి మించి పెంచుకోరాదు.
సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్- 30 ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ((HDFC Bank) లో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రూపంలో తన వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం ఎల్ఐసీకి ఓటింగ్ రైట్స్ లభిస్తాయి.