LIC New Pension Plus | రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇలా.. స్పెషల్ యూఐఎన్ నంబర్ కూడా
LIC New Pension Plus | రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం ఎల్ఐసీ తాజాగా న్యూ పెన్షన్ ప్లస్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
LIC New Pension Plus | దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్ పాలసీ ప్రారంభించింది. రిటైర్మెంట్ తర్వాత సొమ్ము యువత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ పథకం తీసుకొచ్చింది. 25 ఏండ్ల నుంచి 75 ఏండ్ల లోపు వయస్కుల వారు ఈ స్కీమ్ కింద పాలసీ తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్స్, గ్యారంటీ రిటర్న్స్, మార్కెట్ లింక్డ్ పేమెంట్స్, యాన్యుటీ, మధ్యలో కొంత సొమ్ము విత్‌డ్రాయల్స్ వంటి ఫీచర్లు ఈ పథకంలో హైలేట్స్. కస్టమర్లు ఆన్లైన్లో licindia.in వెబ్‌సైట్‌కు వెళ్లిగానీ, ఆఫ్‌లైన్‌లో ఏజంట్లు, మధ్యవర్తుల ద్వారా గానీ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ న్యూ పెన్షన్ ప్లస్ ప్లాన్‌ను ఎల్ఐసీ ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ కోసం ఎల్ఐసీ.. ఏకైక గుర్తింపు నంబర్ ( Unique Identity Number – UIN).. 512L347V01 అందుబాటులోకి తెచ్చింది.
ఎల్ఐసీ న్యూ పెన్షన్ స్కీమ్‌లో సింగిల్ ప్రీమియం గానీ, రెగ్యులర్‌గా.. పీరియాడికల్ పేమెంట్స్ ప్రీమియం గానీ ఎంచుకోవచ్చు. పీరియాడికల్ పాలసీ ఎంచుకున్న వారు గడువులోగా తప్పనిసరిగా ప్రీమియం పే చేయాలి. పాలసీ తీసుకునే వ్యక్తుల వయస్సు, టైం, ఆ వ్యక్తి పెన్షన్ అర్హత పొందే వయస్సు తదితర అంశాల ఆధారంగా ప్రీమియం ఖరారవుతుంది.
కనిష్ట, గరిష్ట పరిమితులకు లోబడి పాలసీదారు తన ప్రీమియం ఎంచుకోవచ్చు. ఇది యూనిట్ లింక్డ్ పర్సనల్ పెన్షన్ ప్లాట్. పీరియాడికల్‌గా క్రమశిక్షణతో చేసే ఈ పొదుపు స్కీమ్ రిటైర్మెంట్ ఫండ్ సమకూర్చుకోవడానికి చేయూతనిస్తుంది. పాలసీ గడువు పూర్తయ్యాక యాన్యుటీ ప్లాన్ కొనుగోలుతో ఒక స్థిరమైన ఆదాయం పొందొచ్చు. పాలసీదారు అభీష్టానికి, అభిమతానికి లోబడి నాలుగు రకాల ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక ప్రతి యేడాదిలో నాలుగు సార్లు తమ పెట్టుబడి ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నది ఎల్ఐసీ.
సింగిల్ ప్రీమియం ఎంచుకున్న వారికి ఐదు శాతం గ్యారంటీ, పీరియాడికల్ ప్రీమియం ఎంపిక చేసుకున్న వారికి 5-15.5 శాతం వరకు గ్యారంటీ రిటర్న్స్ ఆఫర్ చేస్తున్నది ఎల్ఐసీ.. రెండు ఆప్షన్లకు కూడా పాలసీ గడువు పూర్తయ్యాకే చెల్లిస్తుంది. పాలసీ తీసుకున్న ఐదేండ్ల తర్వాత తాము పెట్టుబడి పెట్టిన ఫండ్ల నుంచి పాక్షికంగా నగదు విత్ డ్రాయల్స్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతి ఇస్తుంది. ఇక లైఫ్ అష్యూర్డ్ యాన్యుటైజేషన్ రూల్ మేరకు పాలసీ గడువు ముగిసే టైం లేదా నిలిపివేతపై పాలసీ ద్వారా వచ్చే ఆదాయం వినియోగించుకోవచ్చు.
LIC of India introduced a new plan 'LIC's New Pension Plus' with effect from 05.09.2022 #LIC #NewPensionPlus pic.twitter.com/6vcT6JNsBr
— LIC India Forever (@LICIndiaForever) September 6, 2022
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

