శాంతిచంద్ర, దీపికసింగ్, సిమ్రితి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘డర్టీఫెలో’. ఆడారి మూర్తిసాయి దర్శకుడు. జి.ఎస్.బాబు నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా సంస్థ కార్యాలయంలో చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ట చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
సినిమా ఘన విజయం సాధించాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని దర్శకుడు వశిష్ట ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొన్నది. సత్యప్రకాశ్, నాగినీడు, ఎఫ్.ఎం.బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ ఎస్. సంగీతం: డాక్టర్ సతీశ్‌కుమార్.