న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ఈవీల పరిధిని మరింత విస్తరించడానికి ఆయా మాడళ్లపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కంపెనీకి చెందిన టియాగో ఈవీపై రూ.85 వేల వరకు రాయితీ ఇచ్చిన సంస్థ..
పంచ్ ఈవీపై రూ.1.25 లక్షలు, నెక్సాన్ ఈవీ 3.0పై రూ.65 వేలు, కర్వ్ ఈవీపై రూ.3.10 లక్షలు, హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల చొప్పున రాయితీ ఇచ్చారు. వీటితోపాటు నెక్సాన్, పంచ్, అల్ట్రోజ్, హారియర్ మాడళ్లపై రూ.85 వేల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.