హైదరాబాద్, ఏప్రిల్ 21: అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు నాణేలకు అసలు తరుగే లేదని స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే 0% వీఏతో బంగారు నగలను తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 24దాకా అమల్లో ఉంటుంది. కాగా, పాత నగలను (916 హాల్మార్క్) ఈరోజు మార్కెట్ ధరకు మార్చుకోవచ్చని కూడా ఈ సందర్భంగా ఓ ప్రకటనలో లలితా జ్యుయెల్లర్స్ వెల్లడించింది.