పుణె, ఫిబ్రవరి 7: ప్రపంచంలో ప్రీమి యం మోటర్‌సైకిళ్ల తయారీలో అగ్రగామి సంస్థ కేటీఎం ఒకేసారి మరో మూడు బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 ఏడాదికిగాను విడుదల చేసిన కేటీఎం 250 అడ్వెంచర్ ధర రూ.2,59, 850, అలాగే కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ మాడల్ ధర రూ.2,91,140, కేటీఎం 390 అడ్వెంచర్ రూ. 3,67,699 ధరలు గా నిర్ణయించింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సం బంధించినవి. 399 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 46 పీఎస్‌ల శక్తినివ్వనున్నది. వీటిలో కేటీఎం అడ్వెంచర్ బైకులు దేశీయ షోరూంలో లభించనుండగా, కేటీఎం 390 త్వరలో అందుబాటులోకి రానున్నది.