ధర రూ.2.35 లక్షలు
న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్‌సైకిళ్ళ తయారీ సంస్థ కేటీఎం..తాజాగా 2022 ఎడిషన్‌గా కేటీఎం 250 అడ్వెంచర్‌ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 248 సీసీ ఫోర్-వాల్వ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైకు 30పీఎస్‌ల శక్తినివ్వనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూంలలో ఈ బైకు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.