న్యూఢిల్లీ, జనవరి 24: కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,446 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,305 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధిని సాధించింది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.16,050 కోట్ల నుంచి రూ.16,741 కోట్లకు ఎగబాకింది. మరోవైపు బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.50 శాతం నుంచి 1.30 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.41 శాతం నుంచి 0.31 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.810 కోట్ల నిధులను వెచ్చించింది.