Kotak Mahindra Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారుల డెబిట్ లేదా స్పెండ్జ్ కార్డు సర్వీసులు ఐదు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ నెల 15 (ఆదివారం-14వ తేదీ అర్ధరాత్రి తర్వాత) 12.00 గంటల నుంచి 2.30 గంటల వరకు, తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు డెబిట్ కార్డ్ సేవలు అందుబాటులో ఉండవని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు పంపిన ఈ-మెయిల్లో తెలిపింది. ఈ ఐదు గంటల సమయంలో బ్యాంక్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొంది.
ఏటీఎం, పీవోఎస్, ఈకామ్, క్యూఆర్, పేమెంట్ టోకెనైజేషన్, కార్డులెస్ క్యాష్ విత్ డ్రాయల్, పాన్ అథంటికేషన్, పిన్ జనరేషన్, బ్లాకింగ్ లేదా అన్ బ్లాకింగ్ ఆఫ్ కార్డ్, కార్డ్ కంట్రోల్ – లావాదేవీ పరిమితి సవరణ, యాక్టివేషన్ లేదా డీ యాక్టివేషన్ సర్వీసులు.