న్యూఢిల్లీ : రిక్రియేషనల్ వెహికల్‌గా కారెన్స్‌ను మార్కెట్లో ఎంటర్ చేస్తున్న కియా డిసెంబర్ 16న వెహికల్ డిజైన్‌ను వెల్లడించనుంది. ఈలోగా కియా కారెన్స్ డిజైన్ స్కెచ్లను కంపెనీ విడుదల చేసింది. మూడువరసల సీటింగ్‌తో స్టన్నింగ్ డిజైన్‌తో రూపొందే ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో అందుబాటులో ఉండనుంది.
లగ్జరీ ఇంటీరియర్స్‌తో ఆకట్టుకునే కారెన్స్ మూడో వరుస ప్రయాణీకులకు మెరుగైన స్పేస్ ఉండేలా డిజైన్ చేయబడిందని కియా వెల్లడించింది. యువతను ఆకట్టుకునే ఫీచర్లతో పాటు కంపెనీ పవర్ఫుల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా కారెన్స్ కస్టమర్ల ముందుకొస్తుందని తెలిపింది.
కియా యూనిక్ టైగర్ ఫేస్ డిజైన్ ఫ్రంట్‌తో పాటు ఎక్ట్సీరియర్ హైటెక్ స్టైలింగ్‌తో కూడిఉంటుందని, ఇన్‌టేక్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డేటైం రన్నింగ్ లైట్స్ వంటివి స్ట్రాంగ్, ఇంప్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. ఎస్యూవీ తర్హా సైడ్ ప్రొఫైల్ వెహికల్‌కు మాస్క్యులర్ డిజైన్‌ను మరిపిస్తుందని కంపెనీ పేర్కొంది. కియా కారెన్స్ లాంఛ్ అయితే మారుతి సుజుకి ఎక్స్ఎల్6, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారిలకు దీటైన పోటీ ఇవ్వనుంది.