న్యూఢిల్లీ, జూలై 1: గత నెల జూన్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతంతో పోల్చితే 14 శాతం పెరిగాయని బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.
ఈ ఏడాది మే నెలలో రూ.1.94 లక్షల కోట్లుగా ఉంటే.. నిరుడు జూన్లో రూ.1.71 లక్షల కోట్లు ఉన్నాయి. ఇదిలావుంటే రూ.25,000 ధరకు దిగువన ఉన్న స్మార్ట్ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.