Hamas Attack : ఇజ్రాయెల్‌లో ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన జేపీ మోర్గాన్
ఇజ్రాయెల్-హమాస్ వార్ (Hamas Attack) నేపధ్యంలో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం జేపీ మోర్గాన్ ఛేజ్ (JP Morgan) కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూయార్క్ : ఇజ్రాయెల్-హమాస్ వార్ (Hamas Attack) నేపధ్యంలో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం జేపీ మోర్గాన్ ఛేజ్ (JP Morgan) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌ల మధ్య భీకర దాడులతో భయానక వాతావరణం నెలకొన్న క్రమంలో ఇజ్రాయెల్‌లో తమ ఉద్యోగులను పరిస్ధితి చక్కబడేవరకూ ఇంటి నుంచి పనిచేయాలని కోరింది.
ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితులు నెలకొనడంతో జేపీ మోర్గాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో జేపీ మోర్గాన్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రముఖ ఇండో అమెరికన్లు తీవ్రంగా ఖండించారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటికే 1100 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. 1900 మందికి పైగా గాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన నిక్కీ హేలీ హమాస్ ఉగ్ర మూకలను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్‌ను కోరారు.
Read More :
Amazon | అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్ కలకలం : కమ్యూనికేషన్ డివిజన్స్‌లో కొలువుల కోత
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

