Amazon | అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్ కలకలం : కమ్యూనికేషన్ డివిజన్స్‌లో కొలువుల కోత
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. కమ్యూనికేషన్ విభాగాల్లో కొలువుల కోత చేపట్టడంతో అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెరికా మ్యూజిక్ డివిజన్స్ ఉద్యోగులపై ప్రభావం పడింది.
న్యూయార్క్ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. కమ్యూనికేషన్ విభాగాల్లో కొలువుల కోత చేపట్టడంతో అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెరికా మ్యూజిక్ డివిజన్స్ ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ కమ్యూనికేషన్ విభాగాల్లో 5 శాతం ఉద్యోగులు లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు.
దేశీ, అంతర్జాతీయ లొకేషన్స్‌లోని అమెజాన్ కమ్యూనికేషన్ డివిజన్స్‌లో తాజా లేఆఫ్స్ ప్రభావం చూపుతాయని డెడ్‌లైన్ రిపోర్ట్ వెల్లడించింది. లేఆఫ్స్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజుల పాటు రెగ్యులర్ పే, ఇతర బెనిఫిట్స్‌ను పొందుతారని కంపెనీ పేర్కొంది. జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్‌తో పాటు లేఆఫ్స్ బాధితులు పరిహార ప్యాకేజ్‌కు అర్హులని తెలిపింది.
కాగా, తాము వ్యాపార అవసరాలను మదింపు చేసి అందుకు అనుగుణంగా సర్దుబాట్లు చేస్తుంటామని, ఇటీవల చేపట్టిన సమీక్షలో కమ్యూనికేషన్స్ టీంలో కొందరు ఉద్యోగులను తొలగించాలనే సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీకి వీరు అందించిన సేవలు అత్యున్నతమైనవని, వీరు తదుపరి కెరీర్ నిర్మించుకోవడపై తాము సాయం అందిస్తామని అన్నారు. 2022 నవంబర్ నుంచి 2023 జనవరి వరకూ అమెజాన్ ఏకంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Read More :
Interest Rates | ఇప్పట్లో దిగిరాని వడ్డీరేట్లు.. రుణ భారం తగ్గేదెలా ?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

