రాయ్‌పూర్ : ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో తెలంగాణ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 50కిలోల విభాగంలో గీత రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో గీత 3-6 తేడాతో పూనమ్ ఓరన్(జార్ఖండ్) చేతిలో ఓటమిపాలైంది.
నారాయణపేట జిల్లాకు చెందిన గీత.. విజయం కోసం కడదాకా పోరాడింది. అయితే ప్రత్యర్థి దీటుగా పోరాడటంతో ఓటమి తప్పలేదు. టోర్నీలో రజత పతకం సాధించిన గీతను చెఫ్ డీ మిషన్ గుగులోతు అశోక్‌కుమార్, కోచ్ జైపాల్ యాదవ్ అభినందించారు.