Jio Motive | కారు భద్రత గురించి వాటి ఓనర్లకూ ఎల్లవేళలా ఆందోళన ఉంటుంది. కారు డ్రైవింగ్ లో ఏదైనా అంతరాయం ఏర్పడుతున్నదా..? డ్రైవర్ స్పీడ్ లిమిట్ దాటి డ్రైవింగ్ చేస్తున్నాడా.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అలా కారు కండీషన్ గురించి ఆందోళన చెందకుండా.. దాని బాగోగుల విషయమై పదేపదే డ్రైవర్‌కు ఫోన్ చేయకుండా.. దాని కండిషన్ తెలుసుకునే ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది కదా.. అటువంటి ఫెసిలిటీ తీసుకొచ్చింది జియో.
యజమానితోపాటు డ్రైవర్‌కూ కారు కండిషన్ తెలిపేలా.. ఇద్దరి వద్ద ఉండేలా ఓ పరికరం తెచ్చింది జియో. దాన్ని జియో మోటివ్. కారులో ఏ లోపాలు తలెత్తినా వెంటనే అలర్ట్ చేస్తుంది. ఈ పరికరం పని చేయాలంటే ఈ-సిమ్ కార్డు ఉండాలి.. వై-ఫై హాట్ స్పాట్ మాదిరిగానూ వాడుకోవచ్చు.
జియో మోటివ్ అనే ఈ పరికరం కారులోని ఓబీడీ పోర్ట్ కనెక్ట్ చేస్తే సరి.. కారు సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌కు నోటిఫికేషన్ల రూపంలో అందిస్తూ ఉంటుంది. జియో మోటివ్ వల్ల మీ కారు మరింత స్మార్ట్ రూపం సంతరించుకుంటుంది. కారు లొకేషన్ ట్రాక్ చేసేలా జియో మోటివ్ డిజైన్ చేశారు.
బ్యాటరీ ఓల్టేజీ, ఇంజిన్ టెంపరేచర్ ట్రాక్ చేస్తూ.. డ్రైవింగ్ ఆధారంగా సూచనలతో అనునిత్యం అలర్ట్ చేస్తుంది. ఓవర్ స్పీడ్, హార్ష్ బ్రేకింగ్ కు పాల్పడితే డ్రైవర్ కు హెచ్చరికలు జారీ చేస్తుంది. దొంగతనం నుంచి కాపాడుతుంది. దీనికి జియో ఫెన్సింగ్, టైం ఫెన్సింగ్ ఫెసిలిటీ ఉంటది. కారు భద్రతను పెంపొందించే ‘జియో మోటివ్’ రూ.4999లకు అందుబాటులో ఉంది. జియో థింగ్స్ యాప్ సాయంతో ఈ ‘జియో మోటివ్’ వాడొచ్చు.