న్యూఢిల్లీ: రియలన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ జియో(Reliance Jio) ఇవాళ కీలక ప్రకటన చేసింది. బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో పేర్కొన్నది. స్టార్‌లింక్‌కు చెందిన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవల్ని .. భారత కస్టమర్లకు వేగంగా అందివ్వనున్నట్లు తన ప్రకటనలో జియో వెల్లడించింది. స్టార్‌లింక్ సేవల్ని ఇండియాకు అమ్మేందుకు స్పేస్ఎక్స్ అంగీకరించిన తర్వాత ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో పేర్కొన్నది.
Stars are aligned! ⭐🚀
Jio + @SpaceX = @Starlink for #DigitalIndia#WithLoveFromJio pic.twitter.com/oPDdaCcm5o
— Reliance Jio (@reliancejio) March 12, 2025
జియో ప్రత్యర్థి సంస్థ భారతి ఎయిర్టెల్ కూడా స్టార్‌లింక్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జియో బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థతో స్టార్‌లింక్ జతకానున్నట్లు తమ ప్రకటనలో జియో వెల్లడించింది. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందివ్వనున్నట్లు రిలయన్స్ జియో సీఈవో మాథ్యూ ఒమన్ తెలిపారు. జియో సంస్థ తన రిటేల్ ఔట్లెట్ల ద్వారా స్టార్‌లింక్ ఎక్విప్మెంట్ను అందిచనున్నది. కస్టమర్ సర్వీస్ ఇన్స్టలేషన్, యాక్టివేషన్ కూడా జియో చూసుకోనున్నది. జియోఎయిర్‌ఫైబర్, జియోఫైబర్‌కు వేగంగా ఇంటర్నెట్ అందనున్నట్లు స్పేస్ఎక్స్ సంస్థ పేర్కొన్నది.
Airtel announces an agreement with @SpaceX to bring Starlink’s high-speed internet services to its customers in India. This is the first agreement to be signed in India, which is subject to SpaceX receiving its own authorizations to sell @Starlink in India. It enables Airtel and… pic.twitter.com/5MxViKxh9C
— Bharti Airtel (@airtelnews) March 11, 2025
టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో జట్టుకట్టింది. దీనిపై ఇరు సంస్థలు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో స్టార్‌లింక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి వీలు పడనున్నది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడుతూ..భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్తో పనిచేయడం ఓ మైలురాయి వంటిదన్నారు. కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి కట్టుబడివుందనడానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు.