న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఒకేసారి మూడు సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. రాశి పెరిఫరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి రూ.1,700 కోట్ల నిధులను సమీకరించబోతున్నాయి.
వీటితోపాటు రూ.1,600 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి ఎంటిరో హెల్త్‌కేర్ సొల్యుషన్స్ ఈ నెల 9న ఐపీవోకి రాబోతున్నది. గత నెలలో ఐదు సంస్థలు ప్రైమరీ మార్కెట్ల నుంచి రూ.3,266 కోట్ల నిధులను సమీకరించాయి. 2023లో 58 సంస్థలు నికరంగా రూ.52,637 కోట్ల నిధులను సమీకరించాయి. 2022లో మాత్రం 40 సంస్థలే రూ.59,302 కోట్లను సేకరించాయి. వీటిలో కేవలం ఎల్ఐసీ రూ.20,557 కోట్లను సేకరించింది.