హైదరాబాద్, అక్టోబర్ 24: ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.177 కోట్ల నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.3 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.1,450 కోట్ల ఆదాయాన్ని గడించింది. గత త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచినట్లు సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు.