హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు.
భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇవి కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బంధువులు, స్నేహితుల ఇండ్లు, ఆఫీస్లపైనా ఐటీ దాడులు జరిగాయి. అయితే ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు రహస్యంగా ఉంచారు.