న్యూఢిల్లీ, మే 15: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అర్హులైన ఉద్యోగులకు రూ.64 కోట్ల విలువైన షేర్లను కానుకగా ఇస్తున్నది. 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 షేర్లు, 2019 స్టాక్ ఓనర్షిప్ ప్రొగ్రామ్ కింద 4,07,527 షేర్లు కలిపి మొత్తం 5,11,862 షేర్లను అర్హులైన ఉద్యోగుల కోసం కేటాయించినట్టు ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
ఈ కేటాయింపుతో కంపెనీ మొతం షేర్ క్యాపిటల్ రూ.2,074.9 కోట్లకు పెరుగుతుంది. పనితీరు ఆధారంగా స్టాక్స్‌ను కానుకగా ఇచ్చే ఈ 2019 స్టాక్ ఓనర్షిప్ ప్రొగ్రామ్‌ను కీలక నిపుణుల్ని కంపెనీలో అట్టిపెట్టుకునేందుకు, ఆకర్షించేందుకు ఉద్దేశించారు.