న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి మరో డజన్‌కు పైగా సంస్థలు సిద్ధమవుతున్నది. వీటి వాటాల విక్రయానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది.
దీంతో ఆయా సంస్థలు ఈవారంలోనే వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించాయి కూడా. వీటిలో వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, కరోనా రెమిడీస్, నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్, పార్క్ మెడి వరల్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, కేవీ టాయ్స్ ఇండియాతోపాటు పలు సంస్థలు ఉన్నాయి.