Billionaire Investor : భారత మహిళల వద్ద నమ్మశక్యం కాని రీతిలో బంగారం, వెండి ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ అన్నారు. ఈ విలువైన లోహాలకు భారత మహిళలు ఇచ్చే ప్రాధాన్యత తన ధృక్కోణాన్ని మార్చివేసిందని చెప్పారు. క్వాంటం ఫండ్‌ను ఏర్పాటు చేసిన రోజర్స్ అనతికాలంలోనే బిలియనీర్‌గా ఎదిగారు.
తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పొరపాట్లు చేశానని 81 ఏండ్ల ఇన్వెస్టర్ గురూ, ఇన్వెస్టర్ గుర్తుచేసుకున్నారు. అత్యున్నత లోహాల్లో పెట్టుబడి పెట్టడం మేలని సూచించారు. తన పెట్టుబడుల జీవితంలో ఎన్నో తప్పులు చేశానని, కెరీర్లో పలు స్టాక్ మార్కెట్ మలుపులను కోల్పోయానని చెప్పారు. భారత మార్కెట్‌ను కూడా మిస్ అయ్యానని అన్నారు. ఇక జీవితంలో సంక్లిష్ట సమయాల్లో విలువైన లోహాలు మనల్ని ఆదుకుంటాయని పేర్కొన్నారు.
భారతీయులు ముఖ్యంగా భారత మహిళల నుంచి తాను బంగారం, వెండి గురించి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. భారత మహిళల వద్ద తాను నమ్మశక్యం కాని మొత్తంలో బంగారం, వెండి గమనించానని అందుకే తాను వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. బంగారం, వెండి లాకర్లలో ఉండటం చాలా ముఖ్యమని, సమస్యలు తలెత్తినప్పుడు అవి మనల్ని ఆదుకుంటాయని అన్నారు. తాను వృద్ధ రైతును, సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గర కొంత బంగారం, వెండి ఉంటే బాగుంటుందని వృద్ధ రైతులకు తెలుసని ఆయన పేర్కొన్నారు.
Read More :
AP News | ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. 15 రోజుల దాకా ఛాన్స్