దేశీయ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం కొనసాగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు మదుపరులను ప్రభావితం చేస్తున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 609.51 పాయింట్లు లేదా 0.74 శాతం కోల్పోయి 81,721.08 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 166.65 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 24,853.15 దగ్గర ముగిసింది. దీంతో ఈ వారం కూడా సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. ఈ జనవరి-మార్చి , 2024-25కుగాను దేశ జీడీపీ గణాంకాలు ఈ నెల 30న విడుదలవుతున్నాయి. దీంతో సహజంగానే ట్రేడింగ్ ప్రభావితం కానున్నది.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.