న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోల హెడ్జింగ్‌కు ఈక్విటీ డెరివేటివ్‌లను వాడుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఈక్విటీ డెరివేటివ్‌ల ద్వారా హెడ్జింగ్‌పై మార్గదర్శకాలను విడుదల చేస్తూ అనుమతిచ్చింది.
ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్కెట్లోని బీమా సంస్థల రిస్క్‌ను తగ్గించడానికి ఐఆర్డీఏఐ ఈ తాజా నిర్ణయం తీసుకున్నది. నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీలే ఈ ప్రతిపాదనను చేశాయి. దీంతో ఐఆర్డీఏఐ దానికి ఆమోదం తెలిపింది.