e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బిజినెస్ కరోనా నుంచి కోలుకున్న వారికీ..బీమా ఇక కష్టమే

కరోనా నుంచి కోలుకున్న వారికీ..బీమా ఇక కష్టమే

కరోనా నుంచి కోలుకున్న వారికీ..బీమా ఇక కష్టమే

కరోనా మహమ్మారి చేస్తున్న నష్టాలు అనేకం. కొత్త వేరియెంట్లతో జీవితం భయోత్పాలకు గురవుతుంటే మరో వైపు భద్రత కోసం తీసుకునే బీమా పొందే అవకాశం లేకుండా చేస్తున్నది. భారీగా బీమా క్లెయివ్‌ులు వస్తుండటంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు రకరకాల దారులను వెతుకుతున్నాయి. నిజానికి కొవిడ్‌ దీర్ఘకాల రోగం (క్రానిక్‌ డీసీజ్‌) కిందకు రాదు. కానీ, అవి ఉన్న రోగుల బీమా కన్నా కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు ఇక నుంచి ఆరోగ్య లేదా జీవిత బీమాను పొందడం అంత సులువు కాదు.

ఆరు నెలలు ఆగాల్సిందే..
కొవిడ్‌ బారిన పడి కోలుకున్న తర్వాత వెంటనే జీవిత బీమా పాలసీనో లేదా ఆరోగ్య బీమ పాలసీనో తీసుకోవాలనుకుంటే సాధ్యపడకపోవచ్చు. కొవిడ్‌ విజేతలకు ఇన్సూరెన్స్‌ పాలసీలు ఇచ్చే ముందు చాలా కఠినమైన అండర్‌ రైటింగ్‌ నిబంధనలను పాటిస్తున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కనీసం ఆరు నెలల దాకా ఏ పాలసీ తీసుకునే అవకాశం కనిపించడం లేదు. కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారి దీర్ఘకాలిక ఆరోగ్య స్థితిగతులపై ఇంకా ఒక అంచనా లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా పాలసీలను ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మూడు నెలల తర్వాత మరికొన్ని ఆరు నెలల తర్వాత పాలసీ ఇవ్వడానికి ఏ కంపెనీ ముందుకు రావడం లేదు.

ఆరోగ్య బీమా
కొవిడ్‌ బారి నుంచి బయట పడిన వారు ఆరోగ్య బీమాను తీసుకోవాలంటే ఖచ్చితంగా కొవిడ్‌ గురించి తెలియచేయాల్సి ఉంటుంది. డిస్చార్జి సమ్మరితో సహా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సిందే. బీమా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అండర్‌ రైటింగ్‌ టీవ్‌ు మళ్లీ మీ వద్దకే వచ్చి మరికొన్ని వివరాలను సేకరిస్తారు. మీ హెల్త్‌ రికార్డులను బట్టి మీకు ఆరోగ్య బీమాను ఇవ్వాలా లేదా అనేది తేలుస్తారు. లేదా మీకు బీమా ఇవ్వడాన్ని వాయిదా కూడా వేయవచ్చు. దీంతో పాటు అనేక మెడికల్‌ టెస్ట్‌లను కూడా బీమా కంపెనీలు చేయనున్నాయి. కేవలం కొవిడ్‌ కారణంగానే కాకుండా వయస్సు, బీమా తీసుకునే మొత్తం, అప్పటికే ఉన్న జబ్బుల వంటి కారణాలతో కూడిన మెడికల్‌ టెస్ట్‌లు తప్పని సరి. వీటికి తోడు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారికి మరికొన్ని అదనపు మెడికల్‌ టెస్టులు ఉండవచ్చు.

ప్రస్తుతానికి ఆరునెలల తర్వాత అని చెబుతున్నా, నిజానికి ఈ సమయం మరింత పెరగవచ్చు. కొవిడ్‌ కారణంగా ఊపిరితిత్తులు, గుండె తదితర అవయావలపై ప్రభావం పడుతున్నందున దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చునని బీమా కంపెనీలు భావిస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైద్య నిపుణులు కూడా దీర్ఘకాలికి ఆరోగ్య సమస్యలపై ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. చాలా బీమా కంపెనీలకు అండర్‌ రైటింగ్‌లో వైద్య నిపుణుల కొరత ఉంది. మొదటి వేవ్‌ కన్నా సెకండ్‌ వేవ్‌లో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండటంతో భవిష్యత్తులో ఆరోగ్య బీమా ఇచ్చే విషయంలో బీమా కంపెనీలు చాలా షరతులనే పెట్టే అవకాశం ఉంటుంది.

జీవిత బీమా
జీవిత బీమ పాలసీలు దీర్ఘకాలానికి చెందినవి. దీంతో జీవిత బీమా కంపెనీలు మరిన్ని కఠినమైన నియమాలను కలిగి ఉంటాయి. జీవిత బీమా కంపెనీలు కొవిడ్‌ రికవరీ వ్యక్తులకు పాలసీ ఇచ్చే ముందు ఆరు నెలల గడువును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒకవేళ ఇవ్వాల్సిన వచ్చినా అధిక ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు కొవిడ్‌ నుంచి బయట పడిన ఆరు నెలల తర్వాత కూడా పాలసీని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌.. కొవిడ్‌ నుంచి కోలుకున్న 30 రోజుల క్వారంటైన్‌ పీరియడ్‌ తర్వాత రెండు నెలలకు గానీ పాలసీ ఇవ్వడం లేదు. అలాగే మ్యాక్స్‌ లైఫ్‌ 90 రోజుల తర్వాతనే పాలసీని ఇస్తున్నది. హోమ్‌ క్వారంటైన్‌ అయితే నెల లేదంటే మూడు నెలలని ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిబంధన పెట్టుకుంది. అలాగే కొవిడ్‌ డయాగ్నిసిస్‌ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సిందేనని చెబుతున్నది.

వాక్సినేషన్‌ వివరాలు
కొవిడ్‌ డయాగ్నిసిస్‌, ట్రీట్‌మెంట్‌, డిస్‌చార్జి రికార్డులతో పాటు ఇక నుంచి వ్యాక్సినేషన్‌ రికార్డులు కూడా తప్పని సరే. ఇంకా ఎన్ని వేరియెంట్లు ఎన్ని వేవ్‌లు వస్తాయో తెలియదు కనుక వ్యక్తిగతంగా కొవిడ్‌కు సంబంధించిన మెడికల్‌ రికార్డులన్నీ ఇక నుంచి విలువైనవే. కొవిడ్‌ వల్ల ఉత్పన్నమైన అనిశ్చిత పరిస్థితుల కారణంగా, పాలసీ ఇచ్చే ముందు అదనంగ మెడికల్‌ టెస్టులు సహజమే అనే బీమా కంపెనీల వాదన. ఇటీవల కొవిడ్‌ హాస్పిటలైజేషన్‌, మరణాల కారణంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా క్లెయివ్‌ులు పెరిగినందున బీమా కంపెనీలన్నీ జాగ్రత్తపడుతున్నాయి. గత ఆరు నెలల్లో సీరియస్‌ జబ్బు బారిన పడ్డారా? అని బీమా కంపెనీలు అడగడం పరిపాటి. కానీ , ఇక నుంచి దాంతో పాటే కొవిడ్‌ బారిన పడ్డారా? అని అడుగుతాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా నుంచి కోలుకున్న వారికీ..బీమా ఇక కష్టమే

ట్రెండింగ్‌

Advertisement