Infosys – Microsoft |గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ జెయింట్ ఇన్ఫోసిస్ బుధవారం ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఎంటర్ ప్రైజెస్ కస్టమర్లకు క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, కొలమానంలో క్లయింట్లకు సాయం అందించడానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ సూట్‌ను తన సొల్యూషన్ ఐపీ పోర్ట్ ఫోలియోలో జత చేస్తున్నట్లు తెలిపింది.
పరిశ్రమల పరివర్తన, వ్యాపార లావాదేవీల విస్తరణ, ఉద్యోగుల అనుభవం పెంపొందించడంతోపాటు కస్టమర్లకు నూతన విలువతో కూడిన సేవలు అందించడానికి ఇన్ఫోసిస్‌తో సహకారం కొనసాగిస్తున్నాం అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పార్టనర్ ఆఫీసర్ నికోలే డెజెన్ చెప్పారు. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డెలివరీ కోసం జనరేటివ్ ఏఐ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాం అని తెలిపారు. ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే ప్రధానంగా ముందుకు సాగుతామని ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ తెలిపాయి. గిట్ హబ్ కో-పైలట్ లీడింగ్ యూజర్‌గా ఇన్ఫోసిస్‌కు గుర్తింపు ఉంటుంది. ఈ టూల్ ద్వారా 70 లక్షల లైన్స్ ఆఫ్ కోడ్ 18 వేల మంది డెవలపర్లు జనరేట్ చేస్తున్నారు.