న్యూఢిల్లీ, ఆగస్టు 28 : పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. జూలైలో 3.5 శాతం వృద్ధిని మాత్రమే కనబరిచింది. క్రితం ఏడాది 5 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. కానీ, గడిచిన 4 నెలల్లో ఇదే గరిష్ఠం. తయారీ రంగం ఆశించిన స్థాయిలో 5.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కానీ, మిగతా రంగాలు పడకేశాయి. ముఖ్యంగా గనులు మైనస్ 7.2 శాతానికి పడిపోయింది. విద్యుత్ రంగం కేవలం 0.6 శాతం వృద్ధిని కనబరుచగా, క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 7.9 శాతంగా ఉన్నది. మొత్తంమీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పారిశ్రామిక రంగం 2.3 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్నది.