న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : పారిశ్రామిక వృద్ధిరేటు గత నెలలో 4 శాతంగా నమోదైంది. గనుల రంగం అంచనాలకుమించి రాణించడం వల్లనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
కానీ, జూలై నెలలో నమోదైన 4.3 శాతం కంటే తగ్గింది. గత నెలలో గనుల రంగం 6 శాతం వృద్ధిని సాధించగా, తయారీ రంగం 3.8 శాతం సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐఐపీ వృద్ధి 4.3 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయింది.