Indigo on Tata Sons | ఎయిర్ఇండియాను టేకోవర్ చేయడంతో విమానయాన రంగంలో టాటా సన్స్‌కు గట్టి పోటీ ఉంటుందని దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో అంచనా వేస్తోంది. ఇటీవలే ఎయిర్ ఇండియా టేకోవర్ కోసం రూ.18 వేల కోట్లతో టాటా సన్స్ వేసిన బిడ్‌ను కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. టాటా సన్స్.. విస్తారాలో మెజారిటీ వాటాతోపాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్, బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏషియా ఇండియాలో జాయింట్ వెంచర్ కలిగి ఉంది.
టాటా సన్స్ నుంచి నుంచి గట్టి పోటీ ఉంటుంది. కానీ టాటా సన్స్‌ను ఏవియేషన్ రంగంలోకి స్వాగతించడం తెలివైన నిర్ణయం అని ఇండిగో సీఈవో రొనోజాయ్ దత్తా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం దేశంలో సగానికి పైగా విమానయాన మార్కెట్‌ను, అంతర్జాతీయంగా ఎయిర్ ఇండియా కంటే తక్కువ మార్కెట్‌ను ఇండిగో కైవశం చేసుకున్నది.
ఇండిగో ఏడు గంటల్లోపు గమ్యస్థానాలకు వెళ్లే రూట్లపై కేంద్రీకరించింది. ఎయిర్ ఇండియా సుదూర ప్రాంతాలకు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక దేశీయ మార్కెట్లోకి బుల్ బిలియనీర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సారధ్యంలోని అకాశ ఎయిర్ వచ్చే ఏడాది గగనతలంలోకి దూసుకెళ్లనున్నది. ఆకాశ సహ వ్యవస్థాపకుల్లో ఆదిత్య ఘోష్ తక్కువ కాలంలో ఇండిగో సక్సెస్ కావడానికి కారణం అయ్యారు. కానీ టాటా సన్స్‌తో పోలిస్తే ఆకాశ ఎయిర్‌లైన్స్ నుంచి తమకు అంత ముప్పు ఉండదని దత్తా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!