Indigo | విమాన సర్వీసుల్లో ఇండిగో హిస్టరీ.. అదేమిటంటే..?!
IndiGo | 2006లో దేశీయంగా విమాన యాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ ప్రస్తుతం ప్రతి రోజూ 2000లకు పైగా విమాన సర్వీసులు నడుపుతున్న మైలురాయిని దాటింది.
Indigo | విదేశాలకు వెళ్లే వారి సంఖ్యకు అనుగుణంగా దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులు, రూట్ల సంఖ్య పెంచుతున్నాయి. తాజాగా ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. రోజూ 2000 విమాన సర్వీసులు నడిపి దేశీయ విమానయాన రంగంలో హిస్టరీ క్రియేట్ చేసింది. రోజూ రెండు వేలకు పైగా విమాన సర్వీసులు నడిపిన తొలి సంస్థగా కొత్త మైలురాయి నమోదు చేసింది. 2023 అక్టోబర్ ఓఏజీ గణాంకాల ప్రకారం.. ఫ్రీక్వెన్సీ, సీట్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్త టాప్-10 ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఇండిగో.
‘ప్రస్తుతం ఇండిగో స్పష్టమైన ప్రణాళికతో రోజూ 2000లకు పైగా సర్వీసులు నడుపుతున్నది. కార్గో ఆపరేషన్స్, సీఏపీఎఫ్, ఆర్మీ చార్టర్లు ఉన్నాయి. సంస్థ ప్రారంభించిన 17 ఏండ్లలో ఈ ఘనత నమోదు చేసింది. ఆపరేషనల్ కెపాసిటీ, విశ్వసనీయత, కస్టమర్ కేంద్రీక్రుత సేవల్లో కొత్త బెంచ్ మార్క్ లు క్రియేట్ చేశాం’ అని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
2006లో ఇండిగో దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించింది. 85 దేశీయ, 32 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు నిర్వహిస్తున్నది. సెంట్రల్ అండ్ ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్డ్ లోని వివిధ ప్రాంతాల్లో 20 కేంద్రాల పరిధిలో గత ఆరు నెలల్లో విమాన సర్వీసులు అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

