న్యూఢిల్లీ, జనవరి 14 : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. నూతన సంవత్సరం సందర్భంగా ‘సెయిల్ ఇంటు 2026’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు విమాన టికెట్ ప్రారంభర ధర రూ.1,499గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లో రూ.4,499గా నిర్ణయించింది.
ఈ నెల 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30లోగా ఎప్పుడైనా ప్రయాణించాల్సి వుంటుందని తెలిపింది. విమాన ప్రయాణానికంటే ఏడు రోజుల ముందు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.