Crude Imports | భారత్‌కు సంప్రదాయంగా ఇరాక్, సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా ముడి చమురు ఎగుమతి చేస్తాయి. కానీ గత నెలలో ఆ రికార్డును రష్యా తిరగరాసింది. ఇరాక్, సౌదీ అరేబియా సరఫరా చేసే మొత్తం క్రూడాయిల్ కంటే ఎక్కువగా రష్యా గత నెలలో భారత్‌కు సప్లయ్ చేసింది. గత నెలలో రికార్డు స్థాయిలో ప్రతి రోజూ 1.6 మిలియన్ల బ్యారెల్స్ చమురును రష్యా నుంచి రష్యా దిగుమతి చేసుకుంది. దీంతో వరుసగా ఐదో నెలలో రష్యా నుంచి అత్యధికంగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకున్నట్లయిందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా కథనం. ఇదిలా ఉంటే, ఇరాక్-సౌదీల నుంచి దిగుమతి 16 నెలల కనిష్టస్థాయికి చేరుకుంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు డిస్కౌంట్ రేటుపై రష్యా ముడి సరుకు ఎగుమతి చేస్తున్నది. దీంతో దేశీయ అవసరాల్లో మూడు శాతానికి పైగా రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకున్నదని వొర్టెక్సా పేర్కొంది. క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకున్న తర్వాత దేశీయ ఆయిల్ రిఫైనరీ సంస్థలు దాన్ని పెట్రోల్, డీజిల్‌గా కన్వర్ట్ చేస్తుంటాయి. డిస్కౌంట్ ధరపై లభిస్తుండంతో రష్యా నుంచే ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి రిఫైనరీలు మొగ్గు చూపుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ఒక శాతానికంటే తక్కువ. 2022 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో రోజుకు భారత్ ముడి చమురు దిగుమతి 1.62 మిలియన్ బారెళ్లు. ఇది మొత్తం క్రూడాయిల్ దిగుమతిలో 35 శాతం. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు రష్యా ముడి చమురు డిస్కౌంట్ ధరపై లభిస్తుంది. ఫలితంగా చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనూ అత్యధిక ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచింది.