EV Bus NueGo | హైదరాబాద్- విజయవాడ, బెంగళూరు -తిరుపతి మధ్య విజయవంతంగా బస్సు సర్వీసులు నడిపిన దేశంలోని గ్రీన్ సెల్ మొబిలిటీ ప్రముఖ ప్రీమియం ఎలక్ట్రిక్ బస్ బ్రాండ్ ‘న్యూగో (NueGo) తాజాగా చెన్నై-పుదుచ్చేరి, చెన్నై-బెంగళూరు, చెన్నై- తిరుపతి మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. 2022లో ప్రారంభమైన న్యూగో.. ప్రయాణికులకు పర్యావరణ హిత సురక్షిత, ఆహ్లాదకర ప్రయాణం
అందిస్తున్నది.
భోపాల్-ఇండోర్, ఢిల్లీ -డెహ్రాడూన్, ఆగ్రా-జైపూర్, ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రాధమికంగా బస్సు సర్వీసులు విజయవంతంగా నడుపుతున్నది న్యూ గో. దీనికి అదనంగా దక్షిణ భారత రూట్లలోనూ సర్వీసులు ప్రారంభించింది.వినూత్న టెక్నాలజీతో న్యూగో బస్సులు నడుస్తాయి. చెన్నై- తిరుపతి, చెన్నై-పుదుచ్చేరిల్లో ప్రత్యేక ప్రారంభ ధరతో రూ.319 నుంచి ఒక్కో సీటు ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా గ్రీన్ సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లడుతూ ‘చెన్నై-పుదుచ్చేరి, చెన్నై-తిరుపతి, చెన్నై-బెంగళూరు నగరాల మధ్య మా సర్వీసుల ప్రారంభంతో దక్షిణాది భారత్ మార్కెట్లో విస్తరణకు దోహదం చేస్తుంది. అందుకు నాకు సంతోషంగా ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం’ అని చెప్పారు.
న్యూగోలో శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అందిస్తారు. సెలెక్టెడ్ నగరాల్లో విమానాశ్రయ ప్రీమియం లాంజ్ లోకి అనుమతి సౌకర్యం కల్పిస్తుంది. బస్సుల డ్రైవర్ల పనితీరుపై సీసీటీవీ డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిట్ చెక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు అందిస్తున్నది. బస్సులో ప్రయాణికులకు మొబైల్ చార్జింగ్ ఫెసిలిటీకూడా కలిగించింది.
ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితుల నేపథ్యంలో బస్సులో ఎయిర్ కండిషనర్ లు ఆన్ లో ఉంచడం వల్ల సింగిల్ చార్జింగ్ మీద 250 కి.మీ. ప్రయాణిస్తాయి ఈ న్యూగో ఎలక్ట్రిక్ బస్సులు. వినియోగదారులు న్యూగో (NueGo) అధికారిక వెబ్ సైట్ httpd://nuego.in, ఇతర ప్లాట్ ఫామ్స్ రెడ్ బస్, పేటీఎం, అబిబస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.